Home   »  టెక్నాలజీజాతీయంవార్తలు   »   అంతరిక్షంలో వ్యర్ధాలు.. అందుకే ప్రయోగం ఆలస్యం: ఇస్రో

అంతరిక్షంలో వ్యర్ధాలు.. అందుకే ప్రయోగం ఆలస్యం: ఇస్రో

schedule raju

అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన దాదాపు 27 వేల వ్యర్థ వస్తువులతో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడిందని, దీంట్లో 80 శాతం వ‌ర‌కు ఉప‌గ్ర‌హ శిథిలాలే ఉంటాయ‌ని ఇస్రో పేర్కొన్న‌ది. 10 సెంటీమీట‌ర్ల క‌న్నా త‌క్కువ సైజ్‌లో ఉన్న వ‌స్తువులు దాదాపు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉంటాయ‌ని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు.

శ్రీహరికోటపై ఉన్న అంతరిక్ష ప్రాంతంలో వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయని, దీని వల్ల గత నెల 30న ప్రయోగించిన PSLV రాకెట్‌ను నిమిషం ఆలస్యంగా, ఉద‌యం 6.30 నిమిషాల‌కు చేప‌ట్టాల్సిన ప్ర‌యోగాన్ని.. ఉద‌యం 6.31 నిమిషాల‌కు నింగిలోకి పంపామన్నారు. 500 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భూక‌క్ష్య‌లో స్పేస్ వ‌స్తువులు జామైనందు వ‌ల్లే ఆ ప్ర‌యోగం ఆల‌స్యం జ‌రిగింద‌ని తెలిపారు.

US స్పేస్ క‌మాండ్ అంచ‌నా ప్ర‌కారం 10 సెంటీమీట‌ర్ల సైజు క‌న్నా పెద్ద సైజులో 26,783 అంత‌రిక్ష వ్య‌ర్ధాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ వ్యర్థాల్లో అమెరికాకు చెందినవి 40%, రష్యా 28%, చైనా 19% ఉండగా, భారత్‌కు చెందినవి కేవలం 0.8% మాత్రమేనని పేర్కొన్నారు.