Home   »  జీవన శైలి   »   ‘కోల్డ్ అవుట్’ టానిక్‌ డేంజర్‌: WHO

‘కోల్డ్ అవుట్’ టానిక్‌ డేంజర్‌: WHO

schedule raju

భారత్‌లో తయారైన నాసిరకం సిరప్‌ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ జలుబు సిరప్‌ కోల్డ్ అవుట్.. సురక్షితం కాదని WHO హెచ్చరించింది. ఈ సిరప్‌ను చెన్నైకి చెందిన ఫోర్ట్స్‌ ల్యాబొరేటరీస్‌ తయారు చేయగా… ఇరాక్‌లో ఎక్కువగా వినియోగంలో ఉందని పేర్కొంది. ఇది సురక్షితం కాదని, ముఖ్యంగా పిల్లలు దీనిని వాడితే.. తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, మరణానికి కూడా దారితీసే అవకాశం ఉందని తెలిపింది.

ఇరాక్‌లో అమ్మకానికి వచ్చిన ‘కోల్డ్ అవుట్‘ పేరుతో భారతదేశంలో తయారైన కోల్డ్ మందులో విషపూరిత రసాయనాలు ఉన్నాయని గత నెలలో నివేదికలు పేర్కొన్నాయి. పరీక్షల్లో కోల్డ్ మందులు ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకంతో కలుషితమైందని తేలింది.

“నమూనాలో ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ (0.25%) మరియు ఇథిలీన్ గ్లైకాల్ (2.1%) కలుషితాలు ఉన్నట్లు కనుగొనబడింది. ఇథిలీన్ గ్లైకాల్ మరియు డైథిలిన్ గ్లైకాల్‌లకు ఆమోదయోగ్యమైన భద్రతా పరిమితి 0.10% కంటే ఎక్కువ కాదు” అని WHO తెలిపింది.