Home   »  వినోదం   »   “జైలర్‌” సినిమా చూసేందుకు వచ్చిన జపాన్ జంట

“జైలర్‌” సినిమా చూసేందుకు వచ్చిన జపాన్ జంట

schedule sirisha

“జైలర్‌” చూసేందుకు జపాన్‌ నుంచి వచ్చారు. రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసేందుకు జపాన్‌లోని ఒసాకా నుంచి ఓ జంట తమిళనాడులోని చెన్నైకి వచ్చింది. రజనీకాంత్‌ మీద ఉన్న అభిమానంతో మేము వచ్చాము అని అన్నారు.

రజని అంటే మాకు చాలా ఇష్టం అందుకే మొదటి రోజే జైలర్‌ సినిమా చూడటానికి మేము జపాన్‌ నుండి చెన్నైకి వచ్చామని రజనీకాంత్‌ జపాన్‌ అభిమానుల సంఘం లీడర్‌ యసుదా హిడెతోషి తెలిపారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కళానిధి మారన్‌ నిర్మించారు.