Home   »  జాతీయం   »   చంద్రునికి చేరువలో చంద్రయాన్‌-3..

చంద్రునికి చేరువలో చంద్రయాన్‌-3..

schedule raju

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) పంపిన చంద్రయాన్‌-3 చంద్రుడికి మరింత చేరువైంది. ఇటీవల ల్యాండర్‌ తీసిన ఓ వీడియోను ISRO విడుదల చేసింది. అయితే లూనార్ ఆర్బిట్ ఇన్సెర్షన్ తర్వాత ‘ల్యాండర్‌ హ్యారిజెంటల్‌ వెలాసిటీ కెమెరా (LHVC)’ తీసిన చంద్రుడి ఫొటోను ఇస్రో అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. అలాగే ప్రయోగం రోజు చంద్రయాన్‌-3 తీసిన భూమి ఫొటోను కూడా ఇస్రో షేర్‌ చేసింది.

విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలం మీద దించేందుకు వచ్చే రెండు వారాలు ఇస్రోకు ఎంతో కీలకం కానున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. అక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఈసారి ప్రయోగం విజయవంతం అవుతుందని ఇస్రో నమ్మకం పెట్టుకున్నారు.