Home   »  తెలంగాణఉద్యోగం   »   గ్రూప్‌- 2 పరీక్ష.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

గ్రూప్‌- 2 పరీక్ష.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

schedule raju

తెలంగాణ: గ్రూప్‌- 2 పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగనుండగా, పరీక్షను వాయిదా వేయాలి… లేదా రీషెడ్యూల్‌ చేయాలంటూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో నేడు హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

గ్రూప్- 2 పరీక్షలు రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఇప్పటికే రెండుసార్లు TSPSC ఛైర్మన్ జనార్దన్ రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. జూన్ 26 తో పాటు జూలై 24 తేదీలలో చైర్మన్ ను కలిసి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. TSPSC నుండి ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో TSPSC ముందు ఆందోళన నిర్వహించారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి లేకపోవడంతో TSPSC సెక్రెటరీ అనిత రామచంద్రన్ కు వినతిపత్రం అందజేశారు అభ్యర్థులు.. వినతి పత్రం అందుకున్న సెక్రెటరీ, వాయిదా గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని.. ఆలోచిస్తామని అభ్యర్థులకు చెప్పారు.