Home   »  అంతర్జాతీయం   »   గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక

schedule raju

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్రానిక్స్‌ కు చెందిన ఏజెన్సీ ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In)’ గూగుల్‌ క్రోమ్‌ యూజర్లను హెచ్చరించింది. గూగుల్‌ క్రోమ్‌ ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం యూజర్లను తెలిపింది. కొన్ని వెర్షన్‌లలో బగ్స్‌ గుర్తించామని,  క్రోమ్ యూజర్లు తమ సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసే వివిధ భద్రతా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ ప్రమాదాలలో ఫిషింగ్ అటాక్స్, డేటా ఉల్లంఘనలు, మాల్వేర్ ఇన్ఫెక్షన్‌లు ఉన్నాయి.

వినియోగదారులు జాగ్రత్తగా ఉండటంతో పాటు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది. ప్రాంప్ట్‌లు, వెబ్ పేమెంట్ల API, SwiftShader, Vulkan, Video, WebRTCతో సహా పలు చోట్ల బగ్స్‌ ఉన్నట్లు తెలిపింది. 115.0.5790.170 for Linux & Mac, 115.0.5790.170/.171 for Window వెర్షన్స్‌వాడొద్దని సూచించింది.