Home   »  వార్తలు   »   రెచ్చిపోతున్న చడ్డీ గ్యాంగ్

రెచ్చిపోతున్న చడ్డీ గ్యాంగ్

schedule sirisha

హైదరాబాద్: మాదాపూర్‌లో చడ్డీ గ్యాంగ్ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించిన సైబరాబాద్ పోలీసులు. రెచ్చిపోతున్న చడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

నలుగురైదుగురు వ్యక్తులు షార్ట్‌లు ధరించి, ముఖాలను కప్పుకుని, చేతుల్లో కొన్ని మారణాయుధాలను పట్టుకుని తిరుగుతుతున్నట్లు భవనం బయట అమర్చిన కెమెరాల ఫుటేజీలో కనిపించినట్టు ఆ భవన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసారు.

పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కరుడుగట్టిన నేరగాళ్లు ‘చడ్డీ గ్యాంగ్‌’లో సభ్యులుగా ఉన్నారో లేదో తమ బృందాలు ధృవీకరిస్తున్నాయని సైబరాబాద్ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్ వాసులు ఈ గ్యాంగ్ నుండి జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.