Home   »  జాతీయం   »   మెరుగైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి.. పడిపోయిన ఏపీ ర్యాంక్

మెరుగైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి.. పడిపోయిన ఏపీ ర్యాంక్

schedule raju

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దిగజారింది. తెలంగాణ నాలుగో ర్యాంక్ నుంచి మూడో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌ నిలిచాయి. ఏపీ గతంలో 8వ ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 11వ ర్యాంక్‌కు చేరుకుంది. 2022-23 నివేదికలో పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధ్వాన్నంగా ఉన్నాయి. గత బడ్జెట్ అంచనాల ప్రకారం 2021-22తో పోలిస్తే గుజరాత్ కూడా ఐదో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.