Home   »  జాతీయంటెక్నాలజీ   »   చంద్రయాన్‌-3 కక్ష్యను పెంచిన ఇస్రో

చంద్రయాన్‌-3 కక్ష్యను పెంచిన ఇస్రో

schedule raju

చంద్రయాన్‌-3” ప్రయోగంలో మరో ముందడుగు పడింది. సోమవారం చంద్రునివైపు చంద్రయాన్ 3 స్పీడ్ పెంచారు చంద్రుని చుట్టూ 3 రౌండ్లు పూర్తి చేసిన “చంద్రయాన్‌-3” ని నాలుగో రౌండ్‌ దిశగా కక్ష్యను పెంచారు. ప్రస్తుతం చంద్రుడికి దగ్గరగా 150 కిమీ x 177 కిమీల సమీప వృత్తాకార కక్ష్యను సాధించింది. ఈ నెల 16న ఇస్రో మరోసారి కక్ష్యను పెంచనుంది.

చంద్రయాన్ 3 చంద్రుడికి మరింత చేరువైంది. ఇప్పుడు చంద్రునికి ఈ అంతరిక్ష నౌక కేవలం 1437 కి.మీల కంటే తక్కువ దూరంలో ఉంది. ఆగస్టు 14న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య చంద్రుడి చుట్టూ తన కక్ష్యను తగ్గించినట్టు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రకటించింది.