Home   »  తెలంగాణ   »   స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:కేసీఆర్‌

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:కేసీఆర్‌

schedule raju

తెలంగాణ: 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనా.. ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోతుందని CM Kcr అన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత కారణంగా వనరుల సద్వినియోగం జరగడం లేదని వ్యాఖ్యానించారు. సమైక్యపాలనలో తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయని… స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిపి రాష్ట్రాన్ని సాధించుకున్నామని వెల్లడించారు.

తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేసీఆర్. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని  రైతులకు దాదాపు 37 వేల  కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిందని తెలిపారు.  దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానమన్నారు. . రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు.