పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో… ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై ఫైర్ అవుతున్నారు. సినిమా రిలీజ్కు 45 రోజులే ఉందని, ఇంకా ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయలేదని మండిపడుతున్నారు. మేకర్స్ మేలుకోవాలని, ఈరోజు ఫస్ట్ సింగిల్ అప్టేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తుండటంతో… ‘#WakeUpTeamSALAAR.. Release SALAAR First Song ట్వీట్స్ ట్రెండ్ అవుతోంది.
ఇటీవలే సలార్ సినిమాకు సంబంధించి.. గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్స్ అదరగొట్టాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం దీంతో సరిపెట్టుకోలేదు. సలార్ ఫస్ట్ సాంగ్ విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారు. ట్విట్టర్లోకి వెళ్లి #Release SALAAR First Song ట్రెండింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ చూసైనా.. సలార్ టీమ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.