Home   »  వినోదం   »   ‘దేవర’ నుంచి అప్‌డేట్‌… వేచివుండండి

‘దేవర’ నుంచి అప్‌డేట్‌… వేచివుండండి

schedule raju

గ్లోబల్ యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘దేవర’ నుంచి ఈరోజు అప్‌డేట్‌ రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు అదేంటో ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ట్వీట్‌ చేసింది. అభిమానులు ఆ అప్డేట్ ఏమిటో తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ని పక్కన పెడితే ఎన్టీఆర్‌ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మూవీ ఇది.