Home   »  రాజకీయం   »   అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ… మామ కోసం రంగంలోకి అల్లు

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ… మామ కోసం రంగంలోకి అల్లు

schedule raju

ఐకాన్‌ స్టార్‌ “అల్లు అర్జున్” రేపు నాగార్జున్‌ సాగర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అల్లు అర్జున్‌కు పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి BRS తరఫున నాగార్జున్‌ సాగర్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తారని వార్తలొస్తుండగా.. ఆయన గెలుపు కోసం బన్నీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వస్థలం చింతపల్లిలో నిర్మించిన ఫంక్షన్‌ హాల్‌ను ప్రారంభించేందుకు రేపు “అల్లు అర్జున్” వస్తున్నారంటూ పార్టీశ్రేణులు భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం, ఫంక్షన్ హాల్ ప్రారంభించి.. అక్కడే 10 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. అక్కడే మహిళలకు చీరల పంపిణీ చేయనున్నారు.

పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చంద్రశేఖర్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లతో చర్చలు జరిపి.. రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు.

ఇక ఈ క్రమంలో పుష్ప మూవీతో తగ్గేదేలే అంటూ.. ప్యాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుకున్న ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ కూడా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మామ కోసం భారీ ప్రచారానికి రెడీ అవుతున్నారు.