Home   »  రాజకీయంతెలంగాణ   »   ‘గృహలక్ష్మి’ ఎంపికలో మంత్రుల జోక్యం సరికాదు: RS ప్రవీణ్‌కుమార్‌

‘గృహలక్ష్మి’ ఎంపికలో మంత్రుల జోక్యం సరికాదు: RS ప్రవీణ్‌కుమార్‌

schedule raju

తెలంగాణ: ‘గృహలక్ష్మి’ పథకం లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వకుండా మంత్రులు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ RS ప్రవీణ్‌ కుమార్‌. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అలాగే ఎంపికైన లబ్ధిదారుల జాబితాను గ్రామపంచాయతీ, ఎంపీడీ కార్యాలయాలు, మున్సిపల్‌కార్యాలయాల్లో అంటించాలన్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షలు సరిపోవని  కనీసం రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు… ప్రభుత్వమే ఇటుక, ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

గృహలక్ష్మి కేవలం ఓటర్లను ప్రలోభపెట్టేందుకే అన్నారు. ప్రధానంగా గృహలక్ష్మి దరఖాస్తుకు రేషన్‌కార్డు తప్పనిసరి చేయటం దారుణం తొమ్మిదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు దిక్కులేవు ఇప్పుడు దరఖాస్తులు ఎలా చేసుకుంటారని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, అర్షద్‌ హుస్సేన్‌, పిల్లల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.