Home   »  రాజకీయం   »   కేసీఆర్ పై సంచలన వాక్యాలతో సవాల్‌ విసిరిన అరుణ

కేసీఆర్ పై సంచలన వాక్యాలతో సవాల్‌ విసిరిన అరుణ

schedule sirisha

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై పోటీ చేసి గెలిచే దమ్ము సీఎం kcrకు లేదని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కే. చంద్రశేఖర్ రావుకు దమ్ముంటే చార్మినార్‌ లేదా హుజురాబాద్‌ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఓడిపోతాననే భయంతోనే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చాలా వ్యూహాత్మకంగా పన్నాగాలు పన్నుతూ పాములు కదుపుతూ, కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు. BRS ఎమ్మెల్యేల జాబితాలో బీసీలకు 22 సీట్లు మాత్రమే కేటాయించి వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్ని పన్నాగాలు పన్నిన కూడా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం కాయం అని నొక్కి చెప్పారు.