Home   »  అంతర్జాతీయం   »   మరోసారి తల్లయిన అమెరికన్ టెన్నిస్ స్టార్..

మరోసారి తల్లయిన అమెరికన్ టెన్నిస్ స్టార్..

schedule mounika

మరోసారి తల్లయిన అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త అలెక్సిస్ ఒహానియన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పాపకు ‘అడీరా రివర్ ఒహానియన్’అని పేరు పెట్టారు. ఇప్పటికే సెరెనా, అలెక్సిస్ దంపతులకు ఓ పాప ఉంది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఇల్లంతా ఆనందంతో నిండిపోయిందంటూ అలెక్సిస్ ఫొటోను షేర్ చేశారు. తనకు మరో అసమాన బహుమతి ఇచ్చావని, గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్ టైమ్ నువ్వే అంటూ సెరెనా పై అతడు ప్రశంసలు కురిపించాడు. 2017లో సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినప్పుడు రెండు నెలల గర్భవతి. ఇక ఇప్పుడు రెండో పాపకు 41 ఏళ్ల వయసులో జన్మనిచ్చింది. తల్లి కావడం ఓ ఘనత, ఓ సవాలు అని సెరెనా చెప్పింది.