Home   »  తెలంగాణ   »   “ఉపాధి హామీ” కూలీలకు అలర్ట్..

“ఉపాధి హామీ” కూలీలకు అలర్ట్..

schedule mounika

“ఉపాధి హామీ” కూలీలకు వేతనాల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. SEP 1 నుంచి ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమవుతాయి. అనుసంధానం చేసుకోని వారికి వేతనాలు జమకావని అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ కూలీలు సంవత్సరానికి గరిష్ఠంగా 100 రోజులు పని చేసేందుకు అవకాశం ఉన్నది. ఒక కూలీ కుటుంబం వరుసగా మూడేండ్లపాటు 100 రోజులు పనికి వెళ్తే ఆ కుటుంబం పూర్తిగా పేదరికంలో ఉన్నట్టు అంచనా వేసి కుటుంబంలో ఒకరికి శిక్షణ ఇస్తున్నారు.