Home   »  తెలంగాణ   »   డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో ముగ్గురు అరెస్ట్!

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో ముగ్గురు అరెస్ట్!

schedule sirisha

కాజీపేట: కాజీపేట ట్రాఫిక్‌ పోలీసులు రోజు లాగానే నిన్న (సోమవారం) సాయంత్రం కూడా నిర్వహించిన వాహనాల తనిఖీలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు కింద ముగ్గురికి రెండు రోజులు జైలు శిక్ష పడిందని కాజీపేట సీఐ సుజాత తెలిపారు. కాజీపేట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ ప్రాంతాలలో జరిగిన వాహనాల తనిఖీలలో మద్యం సేవించి ముగ్గురు బైక్ నడుపుతూ దొరికారని సీఐ తెలిపారు వీరిని అరెస్టు చేసి సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుచగా వారికి 2000 జరిమానా, రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రెండు రోజుల శిక్ష అనుభవించిన అనంతరం జరిమానా రుసుము చెల్లించాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేసింది.