Home   »  వినోదం   »   ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌… డైలాగ్‌ లీక్‌.!

‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌… డైలాగ్‌ లీక్‌.!

schedule raju

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే అనూహ్యంగా పుష్ప-2 సినిమా షూటింగ్‌ వీడియోను అల్లు అర్జున్‌ షేర్‌ చేయగా… అందులో సుకుమార్‌, బన్నీ స్కిప్ట్‌ గురించి చర్చించారు.

దాన్ని స్కీన్‌ షాట్‌ తీసిన కొందరు ఫ్యాన్స్‌… సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో ముందు అయితే నీకు, షెకావత్‌కే గొడవ మచ్చా… కానీ ఇప్పుడు సిండికేట్‌ కూడా ఇన్వాల్వ్‌ అయింది’ అనికేశవ కోసం డైలాగ్‌ రాసినట్లు ఉంది. దీంతో పుష్ప-2లో పుష్పరాజ్‌, షెకావత్‌ మధ్య వచ్చే సీన్లపై అంచనాలు పెరిగాయి.