Home   »  రాజకీయం   »   పాలేరు టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ?

పాలేరు టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ?

schedule mounika

తెలంగాణ: ఖమ్మం(D) పాలేరు టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్రపోటీ నెలకొంది. అగ్ర నేతలు నేనంటే నేను అంటూ ప్రకటనలు చేస్తుండటంతో పోటీలో నిలిచేదెవ్వరన్న ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కాంగ్రెస్ లో చేరితే.. షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు నుంచీ పోటీ వచ్చే అవకాశముంది. టికెట్ తమకే ఇవ్వాలని ముగ్గురు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అటు ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో ఉన్న తుమ్మల.

పాలేరులో షర్మిల కోసం శ్రేణులు ఇప్పటికే క్యాంప్ ఆఫీసు, ఇల్లును సిద్ధం చేసినట్లు సమాచారం. పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల, నిన్న ఢిల్లీలో సోనియా,రాహుల్‌ ను కలిశారు. ఇప్పటికే పాలేరులో గ్రౌండ్‌ వర్క్‌ చేసుకున్న షర్మిల ఆ దిశగా అడుగులేస్తున్నారు..చివరికి పాలేరు వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇస్తుందన్న ఆసక్తి నెలకొంది.