Home   »  ఉద్యోగం   »   SBI లో భారీగా ఉద్యోగాలు

SBI లో భారీగా ఉద్యోగాలు

schedule sirisha

డిగ్రీ పాసైన నిరుద్యోగుల‌కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో క్లర్క్‌లు, ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం భారీగా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 6,160 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీలకు 989, ఎస్టీలకు 514, ఓబీసీలకు 1,389, ఈడబ్ల్యూఎస్‌ వారికి 603, అన్‌ రిజర్వుడ్‌ కోటాలో 2,665 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 125, ఏపీలో ౩90 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

అర్హులైన అభ్య‌ర్థులు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు అక్టోబ‌ర్ నెల‌లో గానీ న‌వంబ‌ర్‌లో గానీ ఆన్‌లైన్‌లో రాత ప‌రీక్ష‌తో పాటు స్థానిక భాష ప‌రీక్ష, స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌ వైద్య ప‌రీక్ష‌ల త‌ర్వాత అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాదిపాటు శిక్ష‌ణ ఇస్తారు.