Home   »  వినోదం   »   పవన్ “OG” గ్లింప్స్‌ అదిరిపోయింది

పవన్ “OG” గ్లింప్స్‌ అదిరిపోయింది

schedule raju

సుజిత్‌ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్‌ నటిస్తోన్న OG మూవీ నుంచి అస్టేట్‌ వచ్చింది. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ క్యారెక్టర్‌ దుమ్మురేపింది. పవన్‌ ఎలివేషన్స్‌, థమన్‌ BGM సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పటి వరకు మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల చేయకపోవడంతో నిరాశగా ఉన్న అభిమానులు… తాజా అప్డేట్‌తో ఖుషీ అవుతున్నారు.

ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఈ గ్లింప్స్ తో యూట్యూబ్ రికార్డులు అన్ని పేలుతాయి అని మేకర్స్ చెబుతూ వస్తుండడంతో ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఆ గ్లింప్స్ చూసిన అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. వింటేజ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ని చూసి ఫ్యాన్స్కి పూనకాలు వస్తున్నాయి.

‘ఓజీ’లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ అని ముద్రపడిన ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. ‘బుట్ట బొమ్మ’తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : ఏ.ఎస్ ప్రకాష్, ఛాయాగ్రహణం : రవి.కె.చంద్రన్, సంగీతం : ఎస్. థమన్, నిర్మాత : డీ.వీ.వీ దానయ్య, రచన – దర్శకత్వం : సుజీత్.