Home   »  వినోదం   »   ఓటీటీలోకి జైలర్‌.. అధికారిక ప్రకటన

ఓటీటీలోకి జైలర్‌.. అధికారిక ప్రకటన

schedule raju

రజినీకాంత్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా జైలర్‌ ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్‌ 7 నుంచి ఈసినిమా తమ ప్లాట్‌ఫామ్‌లో స్టీమింగ్‌ కానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వచ్చిందని అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్టీమింగ్‌ చేస్తామని పేర్కొంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

జైలర్ సినిమా బ్లాక్‍బాస్టర్ అయి భారీ కలెక్షన్లను సాధించటంతో ఈ చిత్ర నిర్మాత కళానిధి మారన్.. హీరో రజినీకాంత్‍కు బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును, భారీ మొత్తం విలువైన చెక్‍ను కూడా అందజేశారు. అలాగే, జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‍ కుమార్‌కు కూడా ప్రీమియర్ కారును బహుమతిగా ఇచ్చారు కళానిధి మారన్.

జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‍లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ క్యామియో రోల్స్ చేశారు. వినాయకన్, రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగిబాబు, సునీల్, తమన్నా భాటియా కీలకపాత్రల్లో నటించారు.