Home   »  వార్తలు   »   నెమలి నోటి వెంట నిప్పుల వర్షం..!

నెమలి నోటి వెంట నిప్పుల వర్షం..!

schedule sirisha

ప్రపంచంలో చాలా వింతలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఓ వింత చోటు చేసుకుంది. నెమలి నోటి నుంచి నిప్పులు కురిపిస్తున్న షాకింగ్ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెమలి బిగ్గరగా అరుస్తుండగా నోటిలోంచి మంటలు రావడం గమనించొచ్చు.

అయితే అది ఓ చల్లని ప్రాంతంలో ఉండగా నోటి నుంచి పొగ రావడం, డ్రాగన్ అరుస్తున్నప్పుడు ఏలాగైతే మంటలు వస్తాయో అలాగే అరుస్తున్న ప్రతి సారి మంటలు విరజిమ్ముతుంది. ఇది ప్రకృతి సౌందర్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం జరుగుతుందని కామెంట్స్ పెడుతున్నారు.