తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మా డీ తదితర సీట్లను కేటాయించేందుకు BIPC కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న (ఈ రోజున) అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవాలి. 4, 5 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కన్వీనర్ కోటా కింద మొత్తం ఐదు రకాల కోర్సుల్లో 8,312 సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 114 కాలేజీల్లో 6 వేల 910 బీఫార్మసీ సీట్లు, 61 కళాశాలల్లో 1191 ఫార్మ్ డీ సీట్లు ఉన్నాయి.
ఎంసెట్ BIPC 2023 కౌన్సెలింగ్ సమయంలో తీసుకురావలసిన సర్టిఫికెట్లు
- TSEAMCET -2023 ర్యాంక్ కార్డ్
- TSEAMCET -2023 హాల్ టికెట్
- ఆధార్ కార్డ్
- SSC మార్కుల మెమో
- ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్
- 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్లు
- బదిలీ సర్టిఫికేట్ (TC)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- 2023-24 సంవత్సరానికి తహశీల్దార్ జారీ చేసిన EWS సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం