Home   »  ఉద్యోగం   »   BSC నర్సింగ్ రిజిస్ట్రేషన్ కు మరో 5 రోజుల గడువు

BSC నర్సింగ్ రిజిస్ట్రేషన్ కు మరో 5 రోజుల గడువు

schedule sirisha

తెలంగాణ ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు BSC నర్సింగ్ లో ప్రవేశానికి ఆగస్టు 31 వరకు ఉన్న రిజిస్ట్రేషన్ గడువును కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. BSC నర్సింగ్‌లో నాలుగేళ్ల కోర్సు, రెండేళ్ల కోర్సుల్లో అడ్మిషన్లకు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయం అధికారులు సూచించారు.