Home   »  వినోదం   »   ‘సలార్‌ సినిమా’ పోస్ట్‌పోన్‌?.. కన్ఫర్మ్‌ చేసిన హీరో

‘సలార్‌ సినిమా’ పోస్ట్‌పోన్‌?.. కన్ఫర్మ్‌ చేసిన హీరో

schedule raju

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘సలార్‌ సినిమా’ ఈనెల 28న రిలీజ్‌ కానుండగా… పోస్ట్‌పోన్‌ అయిందని వార్తలొస్తున్నాయి. దీనిపై యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు. ‘ప్రభాస్‌ నటించిన సలార్‌ పోస్ట్‌పోన్‌ అవుతుందని తెలిసి… హాలీడే డేట్‌ కాబట్టి ఈనెల 28న రూల్స్‌ రంజన్‌ సినిమాను రిలీజ్‌ చేసేందుకు టీమ్‌ అంతా ఫిక్స్‌ అయింది’ అని కిరణ్‌ పేర్కొన్నారు. దీంతో ‘సలార్‌’ పోస్ట్‌పోన్‌ నిజమేనని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే సలార్‌ పోస్ట్‌పోన్‌ అవడంతో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు దాంతో ట్విటర్‌లో… #SalaarPostponed హాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

గత రెండు మూడు రోజులుగా ‘సలార్‌ సినిమా’ వాయిదా పడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇప్పుడు అదే తేదీన రూల్స్ రంజన్ విడుదలకు రెడీ అవ్వడంతో సలార్ సినిమా వాయిదా పడినట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపోతే రూల్స్​ రంజన్​ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించారు. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ కూడా సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.