Home   »  రాజకీయం   »   ఉదయనిధి వ్యాఖ్యల కు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి: ఎంపీ జీవీఎల్‌

ఉదయనిధి వ్యాఖ్యల కు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి: ఎంపీ జీవీఎల్‌

schedule raju

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మండిపడ్డారు. విశాఖలో మాట్లాడుతూ…“రాజకీయ బచ్చాగాళ్లు చేసిన వ్యాఖ్యలతో దేశప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉదయనిధి వ్యాఖ్యల ను సమర్ధించిన కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి. ఇది యాంటీ ఇండియా కూటమి విధానం. గెలిచేసత్తా లేక భారతదేశాన్ని, మోదీని విమర్శిస్తున్నారు” అని దుయ్యబట్టారు.

సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, కేవలం దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగుతోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేలారేగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, స్టాలిన్ పార్టీపై విమర్శ ప్రతివిమర్శలు సాగుతున్నాయి. 

ఉదయనిధి వ్యాఖ్యల పై ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్, అశోక్‌ గెహ్లాట్‌ తదితరులు మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ కూటమి హిందూ మతానికి వ్యతిరేకమని ఆరోపించింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, ప్రహ్లాద్‌ జోషి,అనురాగ్‌ ఠాకూర్‌ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి నేతలు క్షమాపణ చెప్పకుంటే దేశం వారిని క్షమించబోదన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉదయనిధిపై ముజఫర్‌పూర్‌కు చెందిన లాయర్‌ సుధీర్‌ కుమార్‌ ఓఝా కోర్టులో పిటిషన్‌ వేశారు.