Home   »  రాజకీయం   »   Yuvagalam : 50 మంది యువగళం వాలంటీర్లు, సిబ్బంది అరెస్ట్‌

Yuvagalam : 50 మంది యువగళం వాలంటీర్లు, సిబ్బంది అరెస్ట్‌

schedule raju

భీమవరం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం‘ (Yuvagalam) క్యాంప్‌ సైట్‌పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. మూడు వాహనాల్లో వచ్చిన పోలీసులు.. యువగళం (Yuvagalam) వాలంటీర్లు, కిచెన్‌ సిబ్బందితో సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిన్న రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి:

మంగళవారం యువగళం పాదయాత్ర కి అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసిపి కార్యకర్తలు కవ్వింపు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.

రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను, కవ్వింపు చర్యలకు స్కెచ్ వేసిన రౌడీ షీటర్ ఎన్ సుధని అరెస్ట్ చెయ్యకుండా యువగళం వాలంటీర్లను అరెస్ట్ చెయ్యడం దారుణమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దగ్గరుండి యువగళం పాదయాత్ర పై దాడి చేయించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి తరలి వస్తున్నారు.

హత్యాయత్నం కేసు నమోదు

ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. అందులో భాగంగా అదుపులోకి తీసుకున్న వాలంటీర్లపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే అల్లరి మూకలను పోలీసులు కట్టడి చేయలేకపోయారనే విమర్శ వినిపిస్తోంది. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

తమ నేత పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇప్పటివకైనా ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు సహకరించాలని సూచిస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.