Home   »  జాతీయం   »   Gaganyaan: వచ్చే నెలలో గగన్‌యాన్‌ క్రూ ఎస్కేప్‌ ప్రయోగం?

Gaganyaan: వచ్చే నెలలో గగన్‌యాన్‌ క్రూ ఎస్కేప్‌ ప్రయోగం?

schedule raju

చంద్రయాన్-3 (Chandrayaan-3), ఆదిత్య-ఎల్1 (Aditya L1) ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో గగన్‌యాన్‌ (Gaganyaan) ప్రాజెక్టుపై దృష్టి సారించింది.

ప్రధానాంశాలు:

  • ఇస్రో.. గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టుపై దృష్టి
  • మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్
  • క్రూ ఎస్కేప్ సిస్టమ్ , క్రూ మాడ్యుళ్లను శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు.

గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టు:

Gaganyaan Mission: చంద్రయాన్-3 (Chandrayaan-3), ఆదిత్య-ఎల్1 (Aditya L1) ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో.. గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టుపై దృష్టి సారించింది.

ప్రత్యేకంగా రూపొందించిన టెస్ట్ వెహికల్ (Test Vehicle) ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్ (Crew Escape System), క్రూ మాడ్యుళ్ల (Crew Module)ను శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు.

దీనికి సంబంధించిన అన్ని హార్డ్‌వేర్‌ వ్వస్థలు ఇప్పటికే శ్రీహరి కోట (Sriharikota) కు చేరుకున్నాయి.

ప్రస్తుతం అనుసంధాన పనులు జరుగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. టెస్ట్ వెహికల్-డీ1 (Test Vehicle-D1) లేదా క్రూ ఎస్కేప్ సిస్టమ్ (Crew Escape System) మిషన్ గా పిలిచే ఈ ప్రయోగాన్ని అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఇస్రో ప్రణాళిక రూపొందించింది.

మిషన్ విఫలమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు మాడ్యుల్ నుంచి వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. 

మిషన్ గగన్‌యాన్‌ దశలు

మొదటి దశలో అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ (Low Altitude Escape Motor) పరీక్షను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. గగన్‌యాన్ ప్రాజెక్టు (Gaganyaan Mission) లో భాగంగా దీనిని గతేడాది నిర్వహించారు.

తాజాగా.. రెండో దశ రికవరీ ట్రయల్స్ లో మాస్ అండ్ షేప్ సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ మోకప్ (CMRM) నిర్వహించారు. ఇది టెస్టింగ్ ప్రక్రియలో ఒక కీలకమైన భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

CMRM వ్యోమగాముల దగ్గరకు సకాలంలో చేరుకోవడం, రికవరీ విధానాలు.. నిజ జీవిత పరిస్థితులను కచ్చితంగా అనుకిరంచేలా ఈ ట్రయల్స్ ఉంటాయి. దాని వల్ల గగన్‌యాన్ మిషన్ విజయానికి విలువైన మరింత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.