Home   »  జాతీయం   »   Dowry | కట్నం కోసం భార్యను వేధింపులు

Dowry | కట్నం కోసం భార్యను వేధింపులు

schedule ranjith

అదనపు కట్నం (Dowry) డిమాండ్‌ చేస్తూ మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి.. తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ వీడియో వెలుగు చూడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ప్రధానాంశాలు:

  • కట్నం డిమాండ్‌ చేస్తూ మధ్యప్రదేశ్ లో భార్యను బావిలో వేలాడదీశాడు
  • భయంతో ఏడుస్తూ ఉండగా వీడియో తీసి బంధువులకు షేర్‌ చేశాడు.
  • పోలీసులు వరకట్నపు వేధింపుల కింద కేసు నమోదు చేశారు.
  • రూ.5 లక్షల కట్నం కావాలంటూ ఆమెను నిత్యం వేధింపులకు పాల్పడేవాడు.

కొందరు అదనపు కట్నం (Dowry) కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇంతటి ఆధునిక యుగంలో కూడా మహిళలు వరకట్నపు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

వ్యక్తి అదనపు కట్నం కోసం భార్యకు తాడు కట్టి.. బావిలో వేలాడదీశాడు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి బంధువులకు పంపించాడు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.

మధ్యప్రదేశ్‌ నీముచ్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. కట్నం కోసం భార్యను తరచూ వేధిస్తున్నాడు. ఆమె భయంతో ఏడుస్తూ ఉండగా వీడియో తీసి బంధువులకు షేర్‌ చేశాడు.

అదనపు కట్నం తీసుకురావాలంటూ రోజూ చిత్ర హింసలకు గురిచేసేవాడు. రూ.5 లక్షల కట్నం కావాలంటూ ఆమెను నిత్యం వేధింపులకు పాల్పడేవాడు.

ఈ క్రమంలోనే ఆగస్టు 20 వ తేదీన ఆమెను తాడుతో బావిలో వేలాడదీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను వీడియో తీసిన కుటుంబ సభ్యులు, బంధువులకు పంపించాడు.

దీంతో ఆ వీడియో చూసిన ఉష తల్లిదండ్రులు తమ కుమార్తెను కాపాడాలని కిశోర్ చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వారు బావి వద్దకు వెళ్లి ఉషను బయటకు తీసుకొచ్చారు.

ఆ తర్వాత ఉష తన తల్లిదండ్రులతో కలిసి రాకేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పోలీసులు రాకేశ్‌ను అదుపులోకి తీసుకొని.. వరకట్నపు వేధింపుల కింద కేసు నమోదు చేశారు.