Home   »  జాతీయం   »   Road accident | డీసీఎం వాహనాన్ని ఓమిని వ్యాన్‌ డీ..

Road accident | డీసీఎం వాహనాన్ని ఓమిని వ్యాన్‌ డీ..

schedule ranjith

తమిళనాడు లోని సేలంకోయంబత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రోడ్డు పక్కన నిలిపిన డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన ఓమిని వ్యాన్‌ డీ కొట్టింది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంగూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణీస్తున్నారు.

ప్రధానాంశాలు:

  • తమిళనాడులోని సేలంకోయంబత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓమిని వ్యాన్‌ డీసీఎంను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
  • జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
  • వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ఇద్దరు గాయపడ్డారు

రోడ్డు ప్రమాదంలో (Road accident) ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవే పై వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న డీసీఎం ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంగూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణీస్తున్నారు.  

ఎంగూరు నుండి  పెరుంతురై వైపు వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిస్వామి, పాపతితో పాటు ఏడాది వయస్సున్న  చిన్నారి మృతి చెందింది.

సమాచారం అందుకున్న సేలం ఎస్పి అరుణ్ కపిలన్, సంఘకిరి డీఎస్పీ రాజా, తహసీల్దార్ ఇదుడై నంబి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ విగ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియ తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు చేసే సమయంలో రోడ్డుకు సమీపంలోని  సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ సీసీటీవీ పుటేజీలో  రోడ్డు ప్రమాదం దృశ్యాలు కన్పించాయి. 

మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం  సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. అతి వేగం,  డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.