Home   »  వినోదం   »   RGV in Kalki: “కల్కి” సినిమాలో విలన్‌గా RGV: అనుదీప్‌

RGV in Kalki: “కల్కి” సినిమాలో విలన్‌గా RGV: అనుదీప్‌

schedule raju

RGV In Kalki: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి 2898 ఏడీ‘ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తో పాటు, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV) నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతిరత్నాలు సినిమా డైరెక్టర్‌ అనుదీప్‌ (Anudeep) గతంలోనే చెప్పారని ఫ్యాన్స్‌ ఓ వీడియోను షేర్‌ చేస్తున్నారు. యాంకర్‌ సుమ ఓ ప్రోగ్రాంలో ప్రాజెక్ట్‌ K లో విలన్‌ ఎవరని అడగ్గా.. రామ్‌ గోపాల్‌ వర్మ (RGV in Kalki) అని అనుదీప్‌ (Anudeep) చెప్పడంతో అంతా నవ్వుకున్నారు.

ప్రభాస్ (prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone) జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’.  ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్, గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

‘కల్కి 2898 ఏడీ’లో ఆర్జీవీ పాత్ర

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) అతిథిపాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా కాలంగా టాక్ నడుస్తోంది.

అయితే ఈ విషయానికి సంబంధించిన మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. కాగా.. ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ తో ముందుకెళ్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోకి ఆర్జీవీ వచ్చాడన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి. ఒకవేళ ఆర్జీవీ ఈ మూవీలో నటిస్తే.. ఏ పాత్ర చేశాడు? విలన్ గానా? లేక ఇంకేదైనా కీ రోల్ చేశాడా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.