Home   »  వినోదం   »   Jailer: OTT లో అదరగొడుతోన్న బ్లాక్‌బస్టర్‌ మూవీ

Jailer: OTT లో అదరగొడుతోన్న బ్లాక్‌బస్టర్‌ మూవీ

schedule raju

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilipkumar) డైరెక్షన్‌లో రజినీకాంత్‌ (Rajinikanth) నటించిన జైలర్‌ మూవీ (Jailer) అమెజాన్‌ పైమ్‌లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా.. OTT లోనూ అదరగొడుతోంది.

ఇండియాలో నంబర్‌-1 స్థానంలో ట్రెండ్‌ అవుతోంది. సినిమాలో రజినీ స్టైల్‌, కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలతో పాటు శివరాజ్‌ కుమార్‌ (Shiva Rajkumar), మోహన్‌ లాల్‌ (Mohanlal) గెస్ట్‌రోల్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

Jailer Movie: ఓటీటీలో జైలర్‌ మూవీ స్ట్రీమింగ్

తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది. ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇందులో తమన్నా (Tamannaah Bhatia)జాకీష్రాఫ్‌ (Jackie Shroff), సునీల్‌ (Sunil), యోగిబాబు (Yogi Babu) కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) మరో కీలక పాత్రలో నటించింది.

సరికొత్త రికార్డు జైలర్‌ సినిమా

ఇక జైలర్ సినిమా ఓవర్సీస్ హక్కులు కూడా భారీ కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. యూఎస్ (USA), యూకే (UK), మలేషియా (Malaysia), ఆస్ట్రేలియా (Australia), శ్రీలంక (Sri Lanka), యూరప్ (Europe) దేశాల్లో జైలర్ మూవీకి (Jailer) మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 30 కోట్ల మేర అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ (Pre-Release) బిజినెస్ జరిగింది.

Netflix | ఒకే OTTలో ‘జవాన్‌”, “మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ స్ట్రీమింగ్.!

జైలర్‌ మూవీ (Jailer) హిట్ టాక్ రావడంతో జైలర్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కోసం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ కూడా దక్కించుకుంటే.. రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ (Gemini TV) సొంతం చేసుకుంం‌ది.