Home   »  వార్తలుజాతీయం   »   G20 సమావేశానికి హాజరు కానున్న మమతా, నితీశ్

G20 సమావేశానికి హాజరు కానున్న మమతా, నితీశ్

schedule mahesh

G20 Summit: న్యూ ఢిల్లీలో జరిగే G20 సమావేశానికి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచాధినేతలంతా ఢిల్లీ కి చేరుతున్నారు. G20 సమావేశానికి దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం అన్ని ఏర్పాట్లతో స్వాగతం పలుకుతోంది.

మినీ ఐక్యరాజ్య సమితి తరహాలో అగ్రదేశాధినేతలు సహా 40కి పైగా దేశాల అధినేతలు, వివిధ ప్రపంచస్థాయి సంస్థల అధిపతులకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది.

అతిధుల కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేసారు. ఇందులో విదేశీ డెలిగేట్స్ తో పాటుగా ముఖ్యమంత్రులు పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు.

ప్రతి ఏడాది రొటేషన్‌ పద్ధతిలో సభ్యదేశాల్లో ఒక దేశం జీ-20 సదస్సుకు నాయకత్వం వహిస్తోంది. ఈ ఏడాది ఆ అవకాశం భారత్‌కు దక్కింది.

రేపు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘వసుధైక కుటుంబం’ నినాదంతో
G-20 సదస్సుకు భారత్‌ నాయకత్వం వహిస్తోంది.

ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తోంది. గత డిసెంబర్‌ నుంచి G-20కి భారత్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది.

ఢిల్లీలో రేపు, ఎల్లుండి జరగనున్న G 20 సమావేశాల నేపథ్యంలో తెలంగాణ-కరీంనగర్‌ వాసికి అరుదైన అవకాశం దక్కింది.

కళాకారుడు ఎర్రోజు అశోక్‌ తయారుచేసిన సిల్వర్‌ ఫిలిగ్రి అశోక చక్ర బ్యాడ్జీలను ప్రపంచ దేశాల అతిథులు సూట్స్‌పై ధరించనున్నారు.

మొత్తం 200 సిల్వర్‌ బ్యాడ్జీలను ఢిల్లీకి పంపినట్లు ఆయన తెలిపారు. సమావేశాలు జరిగే చోట కరింనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రి స్టాలకు కూడా అవకాశం దక్కడం మరో విశేషం.

జీ20 సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ నేటి నుంచి ౩ రోజులపాటు 15కు పైగా దేశాధినేతలతో
ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటూ బిజీగా ఉండనున్నారు.

ఇవాళ బైడెన్‌, షేక్‌ హసీనా, రిషి సునాక్‌తో పాటు జపాన్‌, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో పలు కీలక అంశాలపై చర్చిస్తారు.
ఎల్లుండి ప్రాన్స్‌, కెనడా, తుర్కియే, ఆగక దక్షిణ కొరియా, కొమొరోస్‌, బ్రెజిల్‌, నైజీరియా తదితర
దేశాధ్యక్షులతో సమావేశమవుతారు.