Home   »  రాజకీయం   »   Farmers |బీఆర్ఎస్ పాలన వల్ల రైతులకు తీవ్ర నష్టం..

Farmers |బీఆర్ఎస్ పాలన వల్ల రైతులకు తీవ్ర నష్టం..

schedule mounika

బీఆర్ఎస్ పాలన వల్ల రైతుల(Farmers)కు తీవ్ర నష్టం జరగుతుంది అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం బీజేపీ బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈటల పాల్గొని ప్రసంగించారు.

రైతులు, దళితులు, గిరిజనులు, ప్రజలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్‌కు గుర్తుకొస్తారన్నారు.

అసెంబ్లీలో సమస్యలపై ప్రశ్నిస్తే స్పీకర్ మైకు బంద్ చేస్తారని.. కేసీఆర్ తన మాటలతో దాటేస్తారని మండిపడ్డారు.

బకాయిలు ఎగకొట్టే రైతుల(Farmers) నే ముద్ర..

బకాయిలు ఎగకొట్టే రైతుల నే ముద్ర తెలంగాణ రైతుల(Farmers)పై పడింది. రైతులను రుణ విముక్తులను చేసి కొత్త లోనులను ప్రభుత్వం ఇప్పించాలి. భూములు అమ్మి, లిక్కర్ డ్రాల ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటుంది.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగ్గా అందించడం లేదు. హాస్టల్స్‌లో నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదు.

హెల్త్ కార్డు ద్వారా ఏ ఒక్కరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్యం అందడం లేదు. హాస్పటల్ వాళ్లకు కూడా ప్రభుత్వం బకాయిలు పడింది.

హోంగార్డు లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సీఎం హామీ ఇచ్చి నెరవేర్చలేదు. 

సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్..

KCR మాటలకు చేతలకు పొంతన ఉండదని ఈటల ఫైర్ అయ్యారు. సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఆత్మహత్యల్లో తెలంగాణ ముందు ఉంది. సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు.. ఉన్న పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.. అప్పులలో నెంబర్ వన్.. భూములు అమ్ముకోవడంలో నెంబర్ వన్, చిన్న ఉద్యోగులను వేధిండంలో నెంబర్ వన్..” అంటూ ఈటల ఫైర్ అయ్యారు.

వృద్దులకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా తన దగ్గరే తాళం వేసుకొని హైదరాబాద్‌లో కూర్చున్నారన్నారు. దమ్ముంటే కేసీఆర్ పింఛన్లు అందజేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.

అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఎన్నికలకు ప్రజల ముందుకు వస్తారన్నారు.

ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు మాత్రం ధర్మానికి వేయాలని.. కేసీఆర్‌ను ఓడగొట్టాలని ఈటల కోరారు.