Home   »  అంతర్జాతీయం   »   NASA: అంగారకుడిపై నాసా… ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసిన మెషీన్.!

NASA: అంగారకుడిపై నాసా… ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసిన మెషీన్.!

schedule raju

NASA: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) మరో ఘనతను సాధించింది. అంగారక గ్రహంపై నాసాకు చెందిన మోక్సీ (MOXIE) అనే పరికరం ప్రాణవాయువు ఆక్సిజన్ (Oxygen) ను ఉత్పత్తి చేసింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియ విజయవంతంగా జరిగిందని నాసా (NASA) వెల్లడించింది. అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ (Oxygen) గా మార్చినట్టు తెలిపింది.

Also Read: చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండైన ప్రాంతానికి నామకరణం: మోదీ

అంగారకుడిపై ఆక్సిజ‌న్

భవిష్యత్తులో మార్స్ పైకి మానవులను పంపే మిషన్ లకు ఈ ప్రయోగం ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పింది. అంగారకుడిపై ఉన్న పర్సెవరెన్స్ రోవర్ (perseverance rover) లో ఓవెన్ పరిణామంలో ఉన్న ఒక యంత్రం ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసింది.

ఈ ప్రయోగం ద్వారా అంగారకుడిపై ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది. మోక్సీ (MOXIE) ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసిందని తెలిపింది. ఈ ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా ఉందని… ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పింది.

Also Read: Aditya-L1: సెల్ఫీ తీసుకున్న ఆదిత్య-ఎల్‌1

అంగారకుడిపై మానవ ఆవాసాల దిశ

మార్స్ పై వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ లోని ప్రతీ అణువు నుంచి ఒక ఆక్సిజన్ అణువును వేరు చేయడానికి ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తూ మోక్సీ (MOXIE) అనే పరికరం పనిచేస్తుంది.

ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఆ వాయువును విశ్లేషిస్తుంటుంది. మోక్సీ (MOXIE) సాధించిన విషయం భవిష్యత్తులో అంగారకుడిపై మానవ ఆవాసాల దిశగా ప్రోత్సహిస్తుంది.

Also Read: చంద్రుడి పైకి మరో వ్యోమనౌక …!

పర్సెవరెన్స్ రోవర్

కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం అంగారకుడిపై ద్రవ స్థితిలో నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనికి అక్కడ ఉన్న లోయలు, ఎండి పోయిన నదీ ప్రవాహాల లాంటి గుర్తులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

అయితే కాలక్రమంలో భూమిలాగా గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం, తగిన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో మార్స్ నీరును కోల్పోయిందనే వాదన ఉంది. నాసా ఇంతకుముందు క్యూరియాసిటీ (Curiosity Rover), ఆపర్చునిటీ రోవర్ల (Opportunity Rover) ను అంగారకుడిపైకి పంపింది.

ఇప్పుడు పంపిన పర్సెవరెన్స్ రోవర్ (Perseverance Rover) వీటన్నింటి కన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ రోవర్.