Home   »  జాతీయం   »   Russia |రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంపై G20లో చర్చ

Russia |రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంపై G20లో చర్చ

schedule mahesh

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. పలు కీలక ఒప్పందాల పై ప్రపంచ నేతలు చర్చలు జరుపుతున్నారు. Russia, ఉక్రెయిన్‌ యుద్ధంపై G20లో చర్చ జరిగింది.

అలాగే ఉక్రెయిన్‌, Russia యుద్ధం గురించి కూడా ఈ సమయంలో చర్చకు వచ్చింది.

రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ఎలాగైనా ముగింపు పలకాలని లేదంటే ఈ యుద్ధ ప్రభావం వర్తమాన, ప్రపంచ దేశాలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ సమవేశంలో అన్నారు.

ఈ యుద్ధం విషయంలో G20 దేశాలు అన్ని కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

మోడీ పై మన్మోహన్ ప్రశంసల జల్లు

భారత్ వేదికగా అంతర్జాతీయ జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ప్రధాని మోడీ నాయకత్వ పటిమ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూనే, శాంతి కోసం కూడా ప్రయత్నిస్తోందన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పై భారత్ వైఖరిని అభినందిస్తూ భారత్ సరైన పని చేసిందని అన్నారు.

తన జీవితకాలంలో జీ20 అధ్యక్ష పదవికి భారతదేశానికి అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నారు.

అలాగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి తాను సాక్షిగా ఉన్నట్లు వెల్లడించారు.

భారతదేశం యొక్క పాలనా ఫ్రేమ్‌వర్క్‌లో ఈ విధానం ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అంశంగా ఉందని తెలిపారు.

అయితే ఇది గతంతో పోలిస్తే ఇవాళ దేశీయ రాజకీయాలకు మరింత సందర్భోచితంగా, ముఖ్యమైనదిగా మారిందని మన్మోహన్ చెప్పారు.

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్వత్వానికి బైడెన్ మద్దతు

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా భారత్ కు తమ మద్దతు ఉంటుందని బైడెన్ ప్రకటించారు.


భారత్‌ ఐక్యరాజ్యసమితి లో ఎన్నో ఏళ్ళగా తాత్కాలిక సభ్య దేశం గా కొనసాగుతుంది. అలాగే శాశ్వత సభ్య దేశం హోదా కోసం కూడా భారత్ ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ బద్ద శేత్రువులైన చైనా, పాకిస్థాన్ అడ్డుపడుతూ వస్తునాయి.