Home   »  క్రీడలు   »   Sami Zayn: హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన WWE రెజ్లర్‌

Sami Zayn: హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన WWE రెజ్లర్‌

schedule raju

Sami Zayn: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టీడియంలో జరిగిన WWE సూపర్‌ స్టార్‌ స్పెక్టాకిల్‌ ఈవెంట్‌ కోసం WWE రెజ్లింగ్‌ సూపర్‌స్టార్లు ఇండియాకు వచ్చారు.

అయితే, ఈవెంట్‌ కంటే ముందు సమీజైన్‌ (Sami Zayn) సామాన్య వ్యక్తిలా హైదరాబాద్‌ నగరంలో ఆటోలో తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు.

ఈ వీడియోను WWE ఇండియా టీమ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. నిన్న అర్ధరాత్రి వరకూ ఈవెంట్‌ జరిగిన విషయం తెలిసిందే.

Also Read: johnCena: జాన్‌సీనాతో స్టార్‌ హీరో కార్తి

హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి డబ్ల్యూడబ్ల్యూఈ

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న WWE పోటీలు మొదటిసారి హైదరాబాద్ లో జరగనున్నాయి.

మొదటి సారి భారత్ లో 2016 లో WWE పోటీలు జరగగా తిరిగి 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఈ పోటీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో WWE మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు స్టేడియంకు చేరుకుంటున్నారు.

ఈ మ్యాచ్ లో తమ అభిమాన ఫైటర్లను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు హైదరాబాద్ చేరుకున్నారు.

డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్ సేనా కూడా గచ్చిబౌలికి వచ్చారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత జాన్ సేనా ఇండియాకు వచ్చారు.

అలాగే, ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, విమెన్ ఛాంపియన్ రియా రిప్లే, డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్ (Sami Zayn) హైదరాబాద్ చేరుకున్నారు.

కెవిన్ ఓవెన్స్‌ తోపాటు ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) స్టార్లు హైదరాబాద్ చేరుకున్నారు.

ఇండియాలో రెండవ సారి, హైదరాబాద్‌లో మొదటి సారి ఈ ఈవెంట్ జరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇండియాలో ఈవెంట్స్ మరిన్ని జరగాలని కోరుకుంటున్నట్లు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు చెప్పారు.