Home   »  రాజకీయం   »   Stalin |బీజేపీ పై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్‌

Stalin |బీజేపీ పై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్‌

schedule mahesh

తమిళనాడు: తమిళనాడు యువజన, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి Stalin బీజేపీ పై విరుచుకుపడ్డారు. BJP ఒక విష సర్పమని, ప్రజలు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీ20 సమావేశం సందర్భంగా పేదల మురికివాడలను కనపడకుండా దాచేసి, మీదికి చూడ రంగులతో మెరుగులు దిద్ది ప్రధాని మోదీ తానెంతో అభివృద్ధిని సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.

రాష్ట్రంలోని విపక్ష AIDMK ఒక పనికిరాని పార్టీ అని తమిళనాడులో తలదాచుకునేందుకు బీజీపీకి అది చోటిస్తున్నదని విరుకుచుకు పడ్డరు .

ఈ క్రమంలోనే ఉదయనిధి Stalin తల నరికి తీసుకువస్తే 10 కోట్లు ఇస్తానని ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య స్వామీజీ ఆఫర్ చేశారు.

తన తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించిన స్వామీజీ పై ఉదయనిధి స్టాలిన్‌ మండిపడ్డారు. నా తల కోసం ఎవరు వస్తారో చూస్తాను.

గతంలోనూ కరుణానిధి పై కోటి ప్రకటించారు. నేను ఎవరికీ భయపడను. నా తల కోసం 10 కోట్లు అవసరం లేదు.

దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుంది. నా కోసం అంత మొత్తం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేమి కాదని

తమిళనాడు ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి కరుణానిధి మనవడిని నేను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

అయితే ఈ వ్యవహారం పై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయితే ఇది బహిరంగంగా కాకుండా మంత్రుల సమావేశంలో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటికే స్టాలిన్ వ్యాఖ్యల పై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

BJP పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలని రెచ్చగొట్టుతుందని స్టాలిన్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు BJPకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.