Home   »  జాతీయం   »   Prakash Raj: ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నిరసన… ‘ఈ నగరంలోకి రావడానికి వీల్లేదు’

Prakash Raj: ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నిరసన… ‘ఈ నగరంలోకి రావడానికి వీల్లేదు’

schedule raju

బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ (Prakash Raj) కు కర్ణాటకలో మరోసారి నిరసన సెగ తాకింది.

ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సందర్బంలోనూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) పై వ్యతిరేకత పెరిగింది.

ప్రస్తుతం కర్ణాటకలోని కలబుర్గిలో ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన  కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్ల రంగు చొక్కాలు ధరించి ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలను కాపాడారు.

Trending: Ganta Srinivasa Rao | స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం… చంద్రబాబుతో పాటు గంటా శ్రీనివాసరావు అరెస్ట్

అంతకుముందు  హిందూ సంస్థ ప్రతినిధులు కలబురిగి జిల్లా కలెక్టర్ ను కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. నటుడికి వ్యతిరేకంగా తాము నిరసనలకు దిగడానికి గల కారణాలను వివరించారు. పట్టణంలోకి ప్రకాశ్ రాజ్ ప్రవేశించకుండా నిషేధం విధించాలని కోరారు. ఇక ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆయన పర్యటించిన ప్రాంతాలను హిందూ అనుకూల వాదులు గోమూత్రంతో శుభ్రం చేశారు. 

ప్రకాశ్ రాజ్ వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. చివరికి చంద్రయాన్-3 ప్రయోగంపైనా ఆయన వ్యంగ్య పోస్ట్ లు పెట్టి జనాగ్రహానికి గురయ్యారు.

Also Read: ప్రకాష్ రాజ్‌ పై ఫిర్యాదులు… ట్విటర్‌లో ట్రెండ్‌

ప్రకాశ్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన ట్వీట్

‘బ్రేకింగ్ న్యూస్: టీ అమ్మే కార్టూన్ తో హేళన చేశాడు. బ్రేకింగ్ న్యూస్ విక్రమ్ ల్యాండర్ ద్వారా చంద్రుడిపై నుంచి వస్తున్న మొదటి చిత్రం అంటూ కామెంట్స్ చేశారు.

ఈ ఫోటో మాజీ ఇస్రో చీఫ్ శివన్ ని పోలి ఉందని పలువురు విమర్శించారు. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రకాష్ రాజ్ విమర్శలు ఎదుర్కొన్నారు.

అయితే దీని తర్వాత ఇది ఓ మళయాళ జోక్ కి సంబంధించిందిగా తన ట్విట్ చేసిన రచ్చను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.