Home   »  వార్తలు   »   MP |బండి సంజయ్ కు ఎంపీగా కొనసాగేందుకు అర్హత లేదు

MP |బండి సంజయ్ కు ఎంపీగా కొనసాగేందుకు అర్హత లేదు

schedule mounika

బండి సంజయ్ కు ఎంపీ(MP) గా కొనసాగేందుకు అర్హత లేదు… వెంటనే రాజీనామా చేయాలని సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్ డిమాండ్‌ చేశారు.

కరీంనగర్ లో సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ..చందాలు వసూలు చేసేందుకే…అమెరికాకు బండి సంజయ్ వెళ్లాడని చురకలు అంటించారు.

సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలంటూ గతంలో కేసు వేసివ బండి సంజయ్ ది బ్లాక్ మెయిల్ బతుకు అని…

ఫేక్ కేసులతో బండి సంజయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.

కేసు పెట్టి… ఎవిడెన్స్ ఇచ్చేందుకు కోర్టుకు హాజరు కానీ బండి సంజయ్ కు కోర్టు 50 వేల జరిమానా విధించిందని… తప్పుడు కేసు కాబట్టే MP బండి సంజయ్ కోర్టుకు రాలేదని. 

మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 2.5 లక్షల ఇండ్ల సంగతి ఏమైందో సమాధానం చెప్పాలి అన్న బండి సంజయ్.

బండి సంజయ్ నే ఇప్పుడు అవినీతి ఆరోపణల కారణంగానే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని వివరించారు.

చందాలు వసూలు చేసేందుకే బండి సంజయ్ అమెరికా పోయాడని ఎద్దేవా చేశారు.

మోసపు మాటలతో గెలిచి నియోజకవర్గాన్ని పట్టించుకోని బండి సంజయ్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.

సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్..మెంబర్ షిప్ లేనోళ్లు కాంగ్రెస్ టికెట్ల కోసం ధరఖాస్తు చేసుకున్నారని… కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎలక్షన్స్, సెలక్షన్, కలెక్షన్ అని తెలిపారు.

సీఎం కేసీఆర్ పెట్టిన భారత్ పేరును ప్రధాని మోడీ కాపీ కొట్టారు..ఇండియా పేరు భారత్ గా మారుస్తానంటున్న ప్రధాని మోడీ..

గతంలో చెప్పిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఉత్తదేనా అంటూ చురకలు అంటించారు. బి.ఆర్.ఎస్ పార్టీ వింటేనే మోడీ వణికిపోతున్నారని చురకలు అంటించారు సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్.