Home   »  ఆంధ్రప్రదేశ్   »   Jagananna Arogya Suraksha: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ‘ఆరోగ్య సురక్ష’పై ప్రత్యేక దృష్టి

Jagananna Arogya Suraksha: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ‘ఆరోగ్య సురక్ష’పై ప్రత్యేక దృష్టి

schedule raju

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 15 నుంచి ఆరోగ్య సురక్ష నిర్వహించనుంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకాధికారి యాదాల అశోక్‌బాబు చెప్పారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలోని 15,005 సచివాలయాల్లో ఏఎన్‌ఎంలు (ANM), ఆశ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారన్నారు.

Also Read: CM Jagan: ముగిసిన లండన్ పర్యటన.. తన నివాసానికి చేరుకున్న సీఎం జగన్

జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) పై ప్రత్యేక దృష్టి

ఆరోగ్య సురక్ష ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ జోన్‌-1 రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ఉమాసుందరి సూచించా రు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సోమవారం డీఎంహెచ్‌ వో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఏయే గ్రామాల్లో నిర్వహిస్తారో ముందుగానే అక్కడి ప్రజలకు తెలియజేయాలన్నారు.

ఈ నెల 15న గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తే, 16న ఏఎన్‌ఎంలు, వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తారన్నారు.

సమావేశంలో జేడీ డాక్టర్‌ కె.సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై మరింత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో 17 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతకు 5కే రన్‌, క్విజ్‌, రీల్‌ మేకింగ్‌, డ్రామా విభాగాల్లో పోటీలు నిర్వహి స్తున్నట్టు డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి శ్రీదేవి, క్రీడాభివృద్ధి అధికారి కె.శ్రీధర్‌ తెలిపారు.

దీనికి సంబంధించి పోస్టర్‌ను సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి. లఠ్కర్‌ ఆవిష్కరించారు. విజేతలకు బహుమతులను అంద జేస్తామని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు.

అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు

అనంతరం ఈ నెల 30 నుంచి అక్టోబర్‌ 30 వరకు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు సేవలందిస్తారని తెలిపారు.

ఈ శిబిరాల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు, ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.

14 రకాల పరీక్షలు, 105 రకాల మందుల పంపిణీ చేస్తారని.. స్పెషాలిటీ వైద్యం అవసరమని గుర్తిస్తే వెంటనే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు తరలించి సేవలందిస్తారని తెలిపారు. ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. అలాగే ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇస్తారు.

ఇందు కోసం రూ.66.65 కోట్ల విలువ చేసే 162 రకాల మందులు, 18 సర్జికల్‌ పరికరాలు, ఎమర్జెన్సీ కిట్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

ఈ నెల 30 నుంచి వైద్య శిబిరాల నిర్వహణ మొదలయ్యే నాటికి అన్ని ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారు.

మొత్తం 10,032 విలేజ్‌ క్లినిక్స్, 542 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.