Home   »  వినోదం   »   Salaar Official: సలార్‌ విడుదల అధికారికంగా వాయిదా

Salaar Official: సలార్‌ విడుదల అధికారికంగా వాయిదా

schedule raju

Salaar Official: ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్ సినిమా వాయిదా పడింది. ఈ మేరకు గత రెండు వారాలుగా రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ తాజాగా నిర్మాణ సంస్థ అధికారికం (Salaar Official) గా ఈ వాయిదా విషయాన్ని ధ్రువీకరించింది. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకే వాయిదా వేయాల్సి వస్తోంది.. దయచేసి అర్థం చేసుకోండంటూ అందరినీ రిక్వెస్ట్ చేసింది. హోంబలే (Hombale Films) సంస్థ వారు వేసిన పోస్ట్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Also Read: “సలార్‌” నైజాం రైట్స్‌కు రూ.80 కోట్లు ఆఫర్‌

బుధవారం ఉదయం సలార్ సినిమా (Salaar Movie) వాయిదాపై చిత్రయూనిట్ స్పందించింది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సలార్ వాయిదాపై ఓ పోస్ట్ చేసింది. సలార్ మూవీ (Salaar Movie) కోసం మీ తిరుగులేని మద్దతును మేము ఎంతో అభినందిస్తున్నాము. అనుకోని పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 28న మూవీ విడుదల చేయలేకపోతున్నాం. సలార్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి థాంక్స్. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్రయూనిట్ కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాము అని ప్రకటించారు.

Also Read: సలార్‌ తెలుగు రాష్ట్రాల ధియేటరికల్ హక్కులు… ఎంతో తెలుసా.?

లాంగ్ వీకెండ్ తో పాటు సెలవు దినాలు కలిసొచ్చిన గోల్డెన్ట్ డేట్ ని సలార్ మిస్ చేసుకుంది.

ఈ పరిణామాన్ని టాలీవుడ్ ఇతర చిత్రాలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 

సలార్ నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం విడుదల పోస్ట్ ఫోన్ అని చెప్పారు.

ప్రభాస్ (prabhas) కి జంటగా శృతి హాసన్ (Sruthi Hariharan) నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు (Jagapathi Babu), పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక రోల్స్ చేస్తున్నారు.

కెజిఎఫ్ నిర్మాతలైన హోంబలే పిక్చర్స్ (Hombale Films) నిర్మిస్తున్నారు.