Home   »  జాతీయం   »   Bharath |ఇండియా పేరు మార్పుతో అసలు ఎం మారుతుంది…!

Bharath |ఇండియా పేరు మార్పుతో అసలు ఎం మారుతుంది…!

schedule mahesh

ఇండియా పేరు మార్పుతో అసలు ఎం మారుతుంది రాజ్యాంగంలోని 1వ అధికరణం ఇండియా అనగా Bharath రాష్ట్రాల సముదాయమని చెప్తుంది.
అయితే సెప్టెంబర్‌ 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏండ్ల అనంతరం సరిగ్గా అదే రోజు రాజ్యాంగ సభ నిర్ణయాన్ని తిరగరాయాలనేది కేంద్రం వ్యూహంగా కనిపిస్తున్నది.

కేంద్రం ప్రజల దృష్టిని జమిలి ఎన్నికల వైపు మళ్లించి, జమిలి ఎన్నికల మీద అందరూ తర్జనభర్జన పడుతుండగా, పెద్దగా చర్చలేకుండా దేశం పేరును

ఇండియా బదులు Bharath గా మార్చాలనేది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకే ఈ ప్రక్రియకు సెప్టెంబర్‌ 18ని ఎంచుకున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అందులో ఇంకా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఆ రోజు మొదలవటం వెనుక ఆంతర్యం అదే అనిపిస్తుంది.

దేశం పేరు మార్పు అనేది ఆషామాషీ విషయం కాదు. అదీ సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలలలోపు ఉండగా దేశం పేరు మారితే అధికార పూర్వక పేర్లలో

ఇండియా ఉన్నచోటల్లా దాని స్థానంలో భారత్‌ను చేర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు పాస్‌పోర్టు పై అనేక వందల సంస్థల పేర్లు మార్చాల్సి రావచ్చు.

ఇది చాలా గందరగోళానికి దారితీస్తుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అనే సంస్థలకు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్ఠలున్నాయి.

దాన్ని భారత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీగా మార్చితే ఆ సంస్థకున్న బ్రాండ్‌ విలువ బాగా పడిపోయే ప్రమాదం ఉన్నది.

పేరు మార్పుతో సాధించేదేమిటి పేరులో ఏముంది… విలియం షేక్‌స్పియర్‌ రోజా పువ్వును ఏ పేరుతో పిలిచినా అదే పరమళాన్నిస్తుంది కదా అని చమత్కరించాడు.

దేశం పేరు ఇండియా అయినప్పుడు మనం ఇండియన్స్‌ అని చెప్తాం. దేశం పేరు భారత్‌ అయితే ప్రజల నేషనాలిటీ ఏం ఉండాలి మన దేశంలోనే వివిధ భాషల్లో పలువిధాలుగా అంటారు. తెలుగులో మనం భారతీయులమనుకుంటాం.

మరి తమిళంలో మలయాళంలో, కన్నడంలో ఎలా అంటారు. దేశం పేరు మార్పులో అనేక క్లిష్టమైన అంశాలు ఇమిడి ఉన్నాయి దేశం పేరు మార్పులో వేలకోట్ల రూపాయల ధనం ఖర్చు చెయ్యాలి.

ఈ ప్రక్రియ పూర్తి చెయ్యటానికి దీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పేరుతో ఎంతో గౌరవ సంపాదించుకున్న సంస్థలు కొత్తపేరుతో అదే గౌరవం పేరు ప్రతిష్టలు తిరిగి పొందాలంటే ఎన్నో ఏండ్లు శ్రమించాల్సి ఉంటుంది.

దేశం పేరు మార్పు ఒక మతిలేని ఆలోచనగా కనిపిస్తుంది. ప్రతిపక్షాలు దేశ ప్రతిష్ఠను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని

తమ కూటమికి ఇండియా అనే పేరును మార్చి మరో పేరు పెట్టుకొని ప్రభుత్వ ఆలోచనను విరమింపజేయటం ఉత్తమం అప్పుడు ప్రతిపక్షాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటాయి.