Home   »  తెలంగాణ   »   Initiation |కిషన్ రెడ్డి ఉపవాస దీక్ష భగ్నం..

Initiation |కిషన్ రెడ్డి ఉపవాస దీక్ష భగ్నం..

schedule mounika

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్ష(Initiation)ను పోలీసులు భగ్నం చేశారు.

నిరుద్యోగ యువతలకు సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌లోని ధర్నా చౌక్​ 24 గంటల ఉపవాస దీక్ష(Initiation)లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర నిరుద్యోగ యువత తెగించి పోరాటం చేశారన్నారు.

 తెలంగాణ రాదేమోనని, కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ ఇవ్వదేమోనని 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారు అన్నారు.

అవినీతి కుంభకోణాలు మీవి, చేతకానితనం మీది, లీకేజీలు మీవి? కేసులు మా మీద పెడతారా? డీఎస్సీ వేస్తాం, 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం అని కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు.

రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.

ఇప్పుడు ఏమైంది అని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఉద్యోగం ఇస్తా.. ఉద్యోగం ఇవ్వకుంటే.. రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్‌ ఏమైంది? ఎక్కడ పోయింది రూ.3016?’’ అని ముఖ్యమంత్రిని నిలదీశారు.

హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్య పాపం కేసీఆర్‌దేనని.. ఆయనది ఆత్మహత్య కాదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన హత్యని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

తల్లిదండ్రుల వద్ద ఉన్న బంగారం అమ్మి, అప్పులు తీసుకొని నగరంలో కోచింగ్​ తీసుకొని, వీధి లైట్ల కింద, పార్కుల్లో పస్తులు ఉండి చదువుకొని పరీక్షలు రాస్తే.. ప్రశ్నపత్రాలు లీకై.. 35 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యాయి.

కేసీఆర్​.. ఈ పాపం ఎవరిది? 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్​ తీసుకుంటే వారిని గాలికొదిలేశారు.

నిరుద్యోగుల జీవితాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా..? దానిపై పోరాటం చేస్తే.. గతంలో మా అధ్యక్షుడు బండి సంజయ్​ మీద కేసులు పెట్టారు. సిగ్గు ఉండాలి మీ ప్రభుత్వానికి​.. మినిమమ్​ కామన్​ సెన్స్​ ఉండాలి.

ఉపవాస దీక్ష (Initiation)భగ్నం..

కిషన్‌రెడ్డి ఉపవాస దీక్షను భగ్నం చేసేందుకు బుధవారం సాయంత్రం పోలీసులు ప్రయత్నించారు.

సభకు 6 గంటల వరకే అనుమతి ఉందని చెప్పి అదుపులోకి తీసుకుని బీజేపీ కార్యాలయానికి తరలించడానికి సిద్ధమయ్యారు. వందలాదిమంది కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

పోలీసులు కిషన్‌రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునే క్రమంలో.. బీజేపీ నేతలు పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చుని నిరసనకు దిగారు.

ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తొక్కిసలాటలో కిషన్‌రెడ్డి కాలికి, చేతికి, ఛాతీభాగంలో, ఒంటిపై మరికొన్ని చోట్ల గోళ్లు గీరుకుపోయి గాయాలయ్యాయి.

దాదాపు అరగంటపాటు జరిగిన ఘర్షణ అనంతరం.. పోలీసులు ఆయన్ను అక్కణ్నుంచీ బీజేపీ కార్యాలయానికి తరలించారు.

నిరసనలకు బీజేపీ పిలుపు..

మరోవైపు.. ప్రభుత్వ విధానాలకు, కిషన్‌రెడ్డి పట్ల పోలీసుల తీరును ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది.

నిరసనల్లో పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.