Home   »  వార్తలు   »   హైదరాబాద్: మాదాపూర్‌లో బూటకపు బాంబు కాల్ కలకలం రేపింది.

హైదరాబాద్: మాదాపూర్‌లో బూటకపు బాంబు కాల్ కలకలం రేపింది.

schedule chiranjeevi

హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ ఆవరణలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో కాసేపు భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన యాంటీ బూంబ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కార్యాలయానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బూటకమని ప్రకటించారు.

కార్యాలయంలో యాంటీ బూంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తుండగా ముందుజాగ్రత్త చర్యగా ఉద్యోగులు భవనం నుంచి బయటకు వెళ్లాలని కోరారు. కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కంపెనీలోని పాత ఉద్యోగి ఈ ఫోన్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.