Home   »  క్రీడలు   »   srilanka |నేడు బంగ్లాదేశ్ – భారత్ మ్యాచ్

srilanka |నేడు బంగ్లాదేశ్ – భారత్ మ్యాచ్

schedule mahesh

కొలంబో: srilanka లోని కొలంబోలో జరుగుతున్న ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన భారత జట్టు సూపర్-4లో మరో ఆసక్తికర చివరి పోరుకు సిద్దమైంది. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

ఆదివారం Bharath – srilanka జట్ల మధ్య ఫైనల్ మ్యాచు జరగనుంది. ఆ మ్యాచుకు రిహార్సల్స్‌గా బంగ్లాతో పోరును ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది.

నామమాత్రమైన ఈ మ్యాచు కోసం తుది జట్టులో టీమిండియాలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ మ్యాచు జరగనుంది. ఈ పోరుకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌ పైనల్‌ రేసు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఫలితం పై పెద్దగా ఆసక్తి లేకపోయినా వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా ఎక్కువ సమయంలో లేకపోవడంతో తుది జట్టు కూర్పు సరిచూసుకునేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఇది చక్కటి అవకాశం కానుంది.

ఈ మ్యాచు ఫలితం కంటే కూడా ఇండియా తుది జట్టు పైనే అందరి ఆసక్తి నెలకొంది. వెన్ను నొప్పి కారణంగా గత రెండు మ్యాచుల్లోనూ శ్రేయస్ అయ్యర్ ఆడలేదు.

ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్న అయ్యర్ ఆడుతాడా లేదా అనేది చూడల్సి ఉంది. ఒకవేళ అయ్యర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టాక తప్పదు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సైతం రెస్ట్ ఇవ్వాలనుకుంటే సూర్యకుమార్ బరిలోకి దించే అవకాశాలు లేక పోలేదు. ఒకవేళ వరల్డ్ కప్‌కు ముందు అనవసర ప్రయోగాలు వద్దు అనుకుంటే మాత్రం జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

భారత్ తుది జట్టు అంచనా

  1. రోహిత్‌ (కెప్టెన్‌)
  2. గిల్‌
  3. కోహ్లీ/సూర్య
  4. శ్రేయస్‌/రాహుల్‌
  5. తిలక్ వర్మ
  6. పాండ్యా
  7. జడేజా
  8. అక్షర్‌
  9. కుల్దీప్‌
  10. సిరాజ్
  11. బుమ్రా/షమీ

బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా

  1. షకీబ్‌ (కెప్టెన్‌)
  2. మెహిది హసన్‌
  3. తన్జిద్‌
  4. లిటన్‌దాస్‌
  5. తౌహిద్‌
  6. అఫిఫ్‌
  7. షమీమ్‌
  8. నసుమ్‌
  9. తస్కీన్‌
  10. షరీఫుల్‌
  11. మహమూద్‌