Home   »  జాతీయం   »   Sensational decision |రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Sensational decision |రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

schedule sirisha

రాజస్థాన్ (Rajasthan) కోటాలోని హాస్టళ్ల లోని ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం(Sensational decision) తీసుకుంది.

హాస్టల్ ల్లో ఉంటున్న విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించేందుకు వార్డెన్ లకు, సిబ్బందికి, మెస్ మేనేజ్‌మెంట్ కు కలిపి సైకలాజికల్ మరియు బిహేవియరల్ కౌన్సెలింగ్ ఇచ్చి విద్యార్థులు స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి మీటింగ్ పెట్టి వారిలోని భయాన్ని తగ్గించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.

ప్రభుత్వం సంచలన నిర్ణయం (Sensational decision) పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ లో పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను తగ్గించేందుకు పోరాడాలని విద్యార్థుల సంరక్షణకు సంబంధించిన ఇతర అంశాలలో శిక్షణ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

రాజస్థాన్ (Rajasthan) కోటలోని మూడు హాస్టల్లకు కౌన్సెలింగ్ :-

  1. చంబల్ ప్రభుత్వ హాస్టల్
  2. కోరల్ ప్రభుత్వ హాస్టల్
  3. కోట ప్రభుత్వ హాస్టల్స్

ముందుగా ఈ హాస్టల్ వార్డెన్లు మరియు సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి జై మినేష్ ట్రైబల్ యూనివర్శిటీ తో ఎం.ఓ.యూ పై సంతకం చేశాయి.

కోట హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ఇక్కడ కోచింగ్ హబ్‌లలో 3,500 హాస్టళ్లు ఉన్నాయని అన్నారు. అయితే ఇక్కడికి ప్రతి ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు కోటాకు వస్తుంటారు.

ఎందుకంటే పోటీ పరీక్షలు అయిన ఇంజనీరింగ్ కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మరియు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వస్తారు.

ఈ సంవత్సరం లో విద్యార్థుల ఆత్మహత్యలు 23 కు చేరింది. ఆగస్ట్ 27న కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.