Home   »  క్రీడలు   »   Bangladesh |భారత్ పై 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపు

Bangladesh |భారత్ పై 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపు

schedule mahesh

Srilanka : Srilanka లోని కొలంబోలో జరుగుతున్న ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో పసికూన Bangladesh చేతిలో భారత్‌ 6 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.

మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ మొదట బ్యాటింగ్ బంగ్లాదేశ్‌ నిర్ణిత 50ఓవర్లలో 266 పరుగుల చేసింది.

Bangladesh కెప్టెన్ షకీబుల్ హసన్ (85 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కీలక సమయంలో జట్టు ని ముందు ఉండి నడిపించాడు.

అతడితో పాటు తోవిద్ హ్రుదోయ్ (81 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివర్లో నసూమ్ అహ్మద్ (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఫాస్ట్ గ ఆడటం తో బంగ్లా మెరుగైన స్కోరును అందుకుంది.

Bangladesh |ఆసియా కప్‌ సూపర్‌-4

ఇండియా బౌలర్లలో శార్దుల్ 3 వికెట్ల తో ఆకట్టుకున్నాడు. షమీ 2 వికెట్లు సాధించాడు. బంగ్లాదేశ్ (Bangladesh) నిర్దేశించిన 266 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది.

కెప్టెన్ రోహిత్ శర్మ (0), మొదటి మ్యాచ్ ఆడుతున్న మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (5) పూర్తిగా విఫలమయ్యాడు.

KL రాహుల్ (19), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ (26), రవీంద్ర జడేజా (7) ఇలా అందరు పేవిలియన్ బాట పట్టారు.

అయితే ఓపెనర్ శుబ్ మన్ గిల్ మాత్రం ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తన ఐదవ ODI సెంచరీని నమోదు చేసి, 133 బంతుల్లో 121 పరుగులతో మెరుపులా నిలిచాడు.

ఓ అద్భుత సెంచరీతో భారత్ జట్టును విజయం వైపు నడిపాడు. చివరిలో వచ్చిన అక్షర్ పటేల్ తో కలిసి దాదాపుగా గెలిపించేంత పని చేశాడు.

అయితే కీలక సమయంలో గిల్ వికెట్ కోల్పోయాడు. గిల్ అవుట్ అయిన తరవాత అక్షర్ పటేల్, బంగ్లా బౌలర్ల ఫై విరుచుకు పడ్డాడు. టీమిండియాను విజయం వైపు నడిపాడు.

కానీ 49వ ఓవర్ వేసిన బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ , అక్షర్ తో పాటు శార్దుల్ ఠాకూర్ వికెట్స్ ని తీసి బంగ్లాదేశ్ గెలుపునకు దోహదం చేశాడు.

భారత్ ఆఖరి ఓవర్లో మహమ్మద్ షమీ కావాల్సిన పరుగులు చేయలేకపోయాడు. దింతో భారత్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.